e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home ఆదిలాబాద్ విజయానికి ప్రతీక దసరా

విజయానికి ప్రతీక దసరా

  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • దసరా వేడుకలకు హాజరు
  • బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ

నిర్మల్‌ అర్బన్‌, అక్టోబర్‌ 16 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదా య శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నా రు. పట్టణంలోని బంగల్‌పేట్‌ కాలనీలో శుక్రవా రం రాత్రి జరిగిన వేడుకలకు మంత్రి ముఖ్య అతి థిగా హాజరై రావణాసుర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్‌ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నా రు. దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యే క నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అంతకు ముందు ఆలయంలో, శమీ చెట్టుకు మం త్రి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ ధ్వజారోహణ చేశారు.అనంతరం వేడుక లను తిలకించారు.

ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని పెన్షనర్స్‌ సంఘం భవనంలో ఘనంగా నిర్వహిం చారు. దీనికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలాం విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త అని మన దేశానికి క్షిపణి వ్యవస్థను అందించారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఈద్గాం చౌరస్తా వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా చోట్ల జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయ లక్ష్మి, ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, జిల్లా గ్రం థాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఎ స్‌సీ ఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, ఆలయ చైర్మన్‌ గంగాధర్‌, కౌన్సిలర్‌ రమాదేవి పద్మాకర్‌, బిట్లింగ్‌ నవీన్‌, గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్‌ ఆమెడ కిషన్‌, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌, నరేందర్‌, నాయకులు శనిగారపు నరేశ్‌, డీ శ్రీనివాస్‌, పతికె రాజేందర్‌, అయ్యన్నగారి భూమయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారొద్దీన్‌, సభ్యులు జావీద్‌, జాకీర్‌, రఫీ, మన్సూద్‌, ముజాహిద్‌ అలీ, హుస్సేన్‌, జాహిద్‌ హష్మీ, అజీమ్‌, సల్మాన్‌, కౌన్సి లర్లు మతీ న్‌, సయ్యద్‌, ఇమ్రాన్‌ ముజాహిద్‌, రఫీ, నాయ కులు వసీమ్‌, హబీబ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం మంత్రికి పలువురు నాయకులు పండుగ శుభాకాంక్షాలు తెలిపారు.

ఎస్పీ కార్యాలయంలో..
జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆయు ధాలు, జమ్మి చెట్టుకు, పోలీస్‌ వాహనాలకు లకు ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ పూజలు చేశారు. అనంతరం కార్యాలయంలో మహిళా పోలీస్‌ సిబ్బందికి విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఏఎ స్పీ వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటి, రమేశ్‌, ఎంటీవో కృష్ణాంజ నేయులు, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధ్దికి కృషి : మంత్రి
జిల్లాలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక్రణ్‌ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని రూ. కోటి నిధులతో చేపట్టనున్న బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ నిర్వ హించారు. మంత్రికి ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగల్‌పేట్‌ ఆలయ పరిసరాల్లోని ఐదు చేతుల పోచమ్మ ఆలయం, జంగల్‌ హనుమాన్‌ ఆలయా లను అభివృద్ధి చేస్తామన్నారు. బస్‌డిపో బోయి వాడ కాలనీలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement