
.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
కలెక్టర్, వైద్యాధికారులతో వ్యాక్సినేషన్‌పై టెలీకాన్ఫరెన్స్
వంద శాతం పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం
వ్యాక్సిన్‌తోనే కరోనా దూరం : జడ్పీచైర్మన్ జనార్దన్
క్యాంపులు వినియోగించుకోవాలి : నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
ఎదులాపురం, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సినే షన్ వంద శాతం జరిగేలా ప్రణాళికలు రూపొం దించుకొని అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్, జిల్లా వైద్యశాఖ అధికారులతో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు, పట్టణ ప్రాం తాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించి, వ్యాక్సిన్ అం దించాలన్నారు. వందశాతం వ్యాక్సిన్ పూర్తయ్యే లా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయా లన్నారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ వైద్యం, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్ట ర్ క్యాంపు కార్యాలయంలో సమావేశంలో నిర్వ హించారు. వ్యాక్సినేషన్‌పై అధికారులకు సూచ నలు జారీ చేశారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పి స్తూ వ్యాక్సిన్ అందించాలన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆ ఇంట్లోని సభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకుంటే స్టిక్కర్ అంటించాలన్నారు. పంచాయ తీ కార్యదర్శుల అధ్యక్షతన ఆశ, అంగన్ వాడీ, ఐకేపీ సభ్యులు,ఏఎన్ఎంలతో కలిసి టీమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతా ల్లో ఏఎన్ఎం, మెప్మా, అంగన్వాడీ, ఆశ, మున్సి పల్ సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు వ్యాక్సిన్ కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి కిషన్, డీఎంఅండ్‌హెచ్‌వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీడబ్ల్ల్యూవో మిల్కా, డీఐవో విజయసారథి, శ్రీనివాస్ తదిత రులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌తోనే కరోనా దూరం : జడ్పీచైర్మన్
ఉట్నూర్, సెప్టెంబర్ 16 : ప్రతి 18 సంవత్సరా లు నిండిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. స్థానిక కుమ్రంభీం ప్రాంగణంలో రాజకీయ నాయకు లకు వ్యాక్సినేషన్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యం కాపాడుకోడానికి, కరోనా ను దూరం చేసేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ అంది స్తున్నదని పేర్కొన్నారు. ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికా రు లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సిబ్బంది ఉన్నా రు. అలాగే స్థానిక శాంతినగర్ సబ్సెంటర్లో వ్యాక్సినేషన్‌ను జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరిశీలించారు. ఎంపీడీవో తిరుమల, సిబ్బంది శ్యామల, ప్రేమల, లక్ష్మి, ఐకేపీ సిబ్బంది సీసీ సరస్వతీ, వీవోఏ గోదావరి, గట్క రమేశ్ ఉన్నారు.
క్యాంపులు వినియోగించుకోవాలి : కలెక్టర్
లోకేశ్వరం, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సినేష న్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూ చించారు. లోకేశ్వరం మండలం ధర్మోరా, రాయ పూర్ కాండ్లి, గొడిసెరా గ్రామాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. మాస్కు ధరించాలని పేర్కొన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా, వైస్ ఎంపీ పీ నారాయణ రెడ్డి, నాయకులు భోజన్న, పీఏసీ ఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, ఎంసీటీసీ దత్తురామ్ పటేల్, ఎంపీడీవో గంగాధర్, తహసీల్దార్ లోకేశ్వ ర్రావు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ముథోల్‌లో..
ముథోల్, సెప్టెంబర్ 16 : మండలంలోని మచ్కల్, తరోడా గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రా లను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌కు సం బంధించిన ప్రక్రియను ఎంపీడీవో సురేశ్ బాబు ను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు ఉన్నారు.
కుభీర్‌లో డీపీవో..
కుభీర్, సెప్టెంబర్ 16 : కుభీర్‌లోని పీహెచ్సీ లో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డీపీవో దొంతినేని వెంకటేశ్వరరావు పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సి న్ ఇవ్వాలని సూచించారు. సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, నాయకులకు అవగాహన కల్పించి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఎంపీవో శేఖర్, ఎంపీవో గోవర్ధన్, కుభీర్ ఈవో సాయినాథ్, డాక్టర్ అవినాశ్, సిబ్బంది, నాయకులు ఉన్నారు.