
వేమనపల్లి, డిసెంబర్ 15 : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎంపీపీ కోలి స్వర్ణలత అన్నారు. బుధవారం వేమనపల్లి మండల కేంద్రంతో పాటు నీల్వాయి, చామనపల్లి, సుంపుటం గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ. 3.74 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎంపీపీ కోలి స్వర్ణలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, సర్పంచ్ కుబిడె మధూకర్ అందజేశారు. మామడకు చెందిన గోర్క రాజక్కకు రూ. 1,25,000, నీల్వాయికి చెందిన దుర్గం ప్రకాశ్‌కు రూ. 51 వేలు, జాజులపేటకు చెందిన అంకులుకు రూ. 24 వేలు, గొర్లపల్లికి చెందిన పోషక్కకు రూ. 18 వేలు, కొమురక్కకు రూ. 28 వేలు, కల్మలపేటకు చెందిన రమ్యకు రూ.12 వేలు, సుంపుటానికి చెందిన కూకట్ల మంజులకు రూ.14 వేలు, గట్టయ్యకు రూ.14,500, చంద్రయ్యకు రూ.17 వేలతో పాటు మరో ఐదుగురికి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, సర్పంచ్‌లు కొండగొర్ల బాపు, మోర్ల పద్మ, తాటిపాముల రాజేశ్వరి, గోగర్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
చెన్నూర్ పట్టణంలో..
చెన్నూర్, డిసెంబర్ 15: చెన్నూర్ పట్టణంలోని 4వార్డుకు చెందిన బోగె రవికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును వార్డు కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ బుధవారం అందజేశారు. రవి అనారోగ్యంతో బాధ పడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో రూ.60 వేలు మంజూరయ్యాయి. ఆర్థిక సాయం మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మహేందర్, కళాకారుడు చిరంజీవి పాల్గొన్నారు.