
మంచిర్యాల అడిషనల్ డీఆర్డీవో దత్తరావు
మాదారం, నీలాయపల్లిలో పల్లె ప్రగతి పనుల నిర్వహణపై ప్రశంస
తాండూర్, డిసెంబర్ 15 :పల్లె ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంచిర్యాల అడిషనల్ డీఆర్డీవో దత్తారావు సూచించారు. బుధవారం తాండూర్ మండలంలోని మాదారం, నీలాయపల్లిలోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను ఆయన పరిశీలించారు. మాదారంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో నాటిన పూలు, పండ్ల మొక్కలు, కళాకృతులు, బొమ్మలను చూసి సర్పంచ్ ధరావత్ సాగరికను అభినందించారు. నీలాయపల్లిలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ అభివృద్ధి పనులు చూసి సర్పంచ్ సర్పంచ్ రేపాక సనీతను అభినందించారు. గ్రామాల్లో ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పా టు చేసిందని తెలిపారు. పార్కుల్లో ఖాళీగా ఉన్న ప్రాంతంలో మరిన్ని మొక్కలు నాటాలని సూచించారు. మరింత ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఆయన వెంట ఎంపీడీవో శశికళ, ఎంపీవో అక్తార్ మోయినొద్దీన్, ఏపీవో నందకుమార్, టీఏలు రమేశ్, లక్ష్మి, కార్యదర్శులు సౌందర్య, రమ, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.