
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
మహిళా మహోత్సవం-రుణ వితరణ’ కార్యక్రమం
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 14 : మహిళలు బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి కోరారు. అమ్మ గార్డెన్స్‌లో మంగళ వారం ‘మహిళా మహోత్సవం – రుణ వితరణ’ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదరిక నిర్మూలన, ప్రతి మహిళా ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు దోహదపడుతాయన్నారు. ఇందుకోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు వారంలో ప్రతి మంగళ, గురువారాలు మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకే సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. టీజీబీ కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను సైతం మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చి వారికి మరింత ఆదాయం చేకూరేలా ప్రణాళికలు రూపొందించేలా బ్యాంకు అధికారులు యోచిస్తున్నారన్నారు. టీజీబీ చైర్మన్ అరవింద్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 425 బ్రాంచ్‌లుండగా మంచిర్యాల రీజియన్ పరిధిలోని మం చిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో 62 టీజీబీ శాఖలున్నాయని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 36 టీజీబీ శాఖల్లో 13,756 సంఘాలకు రూ.428 కోట్ల రుణం అందజేశామని చెప్పారు. నూతనంగా 1,450 సంఘాలు ఏర్పడగా.. వారికి రుణాలు అందజేయనున్నామన్నారు. జిల్లాలో ఎస్‌హెచ్‌జీలకు రుణాన్ని రూ.1100 కోట్లకు పెంచుతామని చెప్పారు. అందుకు డీఆర్డీఏ అధికారులు ఎంసీ బీ ఇస్తే 48 గంటల్లోనే ఆ సంఘానికి రుణం అందజేయనున్నామని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు కలెక్టర్, టీజీబీ చైర్మన్లు రూ.24.13 కోట్ల రుణ చెక్కును సంఘ సభ్యులకు డీఆర్డీఏ పీడీ శేషాద్రి, ఎల్డీఎం హవేలి రాజుతో కలిసి అందజేశారు. టీజీబీ రీజినల్ మేనేజర్ చం ద్రశేఖర్ రెడ్డి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ శ్రీనివాస్, డీపీఎం స్వర్ణలత, జిల్లాలోని టీజీబీ బ్రాంచ్‌ల మే నేజర్లు, సిబ్బంది, మహిళా సంఘాల వీవోలు, స భ్యులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ గ్రా మీణ బ్యాంకులో పీఎంఎస్‌వై కింద రూ.12, పీఎంజేజేబీవై కింద రూ.330తో పాటు ఎస్బీఐలో రూ.1000తో బీమా చేసుకున్న మంథని బానయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందా డు. నామినీగా ఉన్న ఆయన భార్య మంథని పద్మకు రూ.24 లక్షల ప్రమాదబీమా చెక్కును కలెక్టర్ భారతీ హోళికేరి, టీజీబీ చైర్మన్ అరవింద్ అందజేశారు.
యాసంగిలో వరి వేయవద్దు
కన్నెపల్లి, డిసెంబర్ 14 : రైతులు యాసంగిలో వరి పంట వేయవద్దని, ఇతర పంటలు సాగు చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. భీమిని మండలంలోని రాంపూర్, బిట్టూరుపల్లి గ్రామాల్లో రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. రైతులందరూ వరి కాకుండా వేరుశనగ, మినుమలు, నువ్వులు, పెసర, కూరగాయలు తదితర పంటలు సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. రైతులందరూ ఒకే పంట కాకుండా రకరకాల పంటలు పండించాలని తెలిపారు. అర్హులందరూ కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు వేయించుకోవాలని, కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్, భీమిని మండల ప్రత్యేకాధికారి ఫణిందర్‌రావు, ఎంపీడీ వో జవహర్లాల్, ఏడీఏ సురేఖ, ఏపీవో ప్రసాద్, సర్పంచ్ అనిల్‌గౌడ్, ఏఈవోలు పాల్గొన్నారు.
మేడం సెల్ఫీ ఫ్లీజ్..
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 14 : ‘మహిళా మహోత్సవం – రుణ వితరణ’ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ భారతీ హోళికేరిని స్వయం సహాయక సంఘాల సభ్యులు ‘మేడం వన్ సెల్ఫీ ఫ్లీజ్..’ అని కోరారు. వారి కోరిక మేరకు వారితో కలెక్టర్ సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగడంతో ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.