
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
ఇంద్రవెల్లి, డిసెంబర్ 14 : ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి రా ష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మె ల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. హర్కాపూర్ఆంధ్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాం ఆదివాసీ గిరిజనులకు మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా ఆమెను మహిళల ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర నీటి పారుదల శాఖకు చెం దిన కొంతమంది రాష్ట్రస్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏజెన్సీలోని కొలాం ఆదివాసీ గిరిజనులకు దుప్పట్లు అందిస్తున్నారన్నారు. గ్రామస్తు ల కోరిక మేరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ ని ర్మాణానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయని తె లిపారు. నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుడే కైలాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అ బ్దుల్ అమ్జద్, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్‌నాయక్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియా న్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సుకేష్మ, నీటి పారుదల శాఖ డీఈ వినోద్‌కుమార్, ఏఈలు ప్రవీణ్‌కుమార్, తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాంనాయక్, దేవ్‌పూజే మా రుతి, కోరెంగా సుంకట్రావ్, శ్రీనివాస్, రాం దాస్, రాంనివాస్, శివాజీ, మహేశ్ పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి..
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 14 : మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో గొట్టి తండా టీం గెలుపొందగా, వారికి ఎమ్మెల్యే రేఖానాయక్ బహుమతి అందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ప్రతిభను వెలితీసేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, శ్రీరాం నాయక్, నాయకులు, యువకులు పాల్గొన్నారు.