
ఆదిలాబాద్,ముథోల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీ విఠల్ రెడ్డి
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 14: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన హమాలీ యూనియన్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్, ఆయిల్ మిల్ హమాలీ కార్మికులు సుమారు 100 మంది టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అశోక్ స్వామి, రవి పాల్గొన్నారు.
సీఎం కేసీర్తోనే బంగారు తెలంగాణ
తానూర్, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని వడ్గావ్లో శనివారం టీఆర్ఎస్ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షే పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు వస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న వడ్గావ్ గ్రామ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాననీ హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్లో చేరిన వారు..
మండల కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావు పటేల్, ఉమ్రి (కే)సర్పంచి పావులే రత్నమాల, మారుతీ పటేల్, ఉప సర్పంచ్ దేవుకే సాయినాథ్, మొగిలి ఎంపీటీసీ సిరిమొల్ల లక్ష్మణ్, కోలూర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డోడ్ రాజులు తమ అనుచరగణంతో వందలాది మంది టీఆర్ఎస్లో చేరారు. వడ్గావ్కు చెందిన నాయకులు, యువకులు పార్టీలో చేరారు. ముందుగా వడ్గావ్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బ్యాండు మేళాలతో ర్యాలీగా ఊరి పొలిమేర నుంచి గ్రామంలోకి తీసుకు వచ్చారు. సమావేశంలోమహారాష్ట్ర సంప్రదాయమైన తలపాగాలు పెట్టి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, వైస్ ఎంపీపీ చంద్రకాంత్, సర్పంచ్ సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ్‌రావు పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు తాడేవార్ విఠల్, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు పోశెట్టి, నాయకులు తోట రాము, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.