
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఇచ్చోడ, ఆగస్టు 14 : పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని అడెగామ (కే)లో ఉపాధిహామీలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే బాపురావ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం 500 ఉన్న జనాభా తండాలు, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కొత్తగా ఏర్పాటైన జీపీలకు పంచాయతీ భవనాలను మంజూరు చేస్తూ నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం అనితా సుభాష్ రెడ్డి, ఎంపీటీసీ కొత్తూరి సుజాత, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, పీఏసీఎస్ డైరక్టర్ బద్దం పురుషోత్తం రెడ్డి, ఉప సర్పంచ్ కుంట సునీత, టీఆర్ఎస్ నాయకులు ముస్తాఫా, రాథోడ్ ప్రకాశ్, వెంకటేశ్, రాథోడ్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, పంచాయతీ కార్యదర్శి భూమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం ప్రారంభం
బోథ్, ఆగస్టు 14: గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్ర భవనాలు నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని ఎమ్మెలే రాథోడ్ బాపురావ్ అన్నారు. పొచ్చెరలో సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. భవన నిర్మాణం కోసం రూ. 15 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ బీ మల్లేశ్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, టీఆర్ఎస్ కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్, డాక్టర్ రవీంద్రప్రసాద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
32 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
బజార్హత్నూర్, ఆగస్టు 14: తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ 32 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ కూన గంగాధర్, సర్పంచ్ లావణ్య, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, ఎంపీటీసీ తిరుమల, మండల కన్వీనర్ రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, టీఆర్ఎస్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.