
రూ.1.50 కోట్ల నిధులతో ల్యాబ్ ఏర్పాటు
రోగులకు సత్వర సేవలు..
మంత్రి చొరవతో ల్యాబ్ ఏర్పాటు
నేడు జిల్లా దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్న మంత్రి
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
నిర్మల్ అర్బన్, ఆగస్టు 14 : కొవిడ్ వైరస్ నిర్ధార ణ పరీక్షలకు ఉపయోగించే ఆర్టీపీసీఆర్ ల్యాబ్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. వైరస్ నిర్ధా రణను కచ్చితంగా తెలిపే ఈ పరీక్ష కేవలం హైద రాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉండడంతో జిల్లా రోగులకు ఇబ్బందులు తలెత్తేవి. ల్యాబ్ పరీక్ష ఫలితాలు రావాలంటే దాదాపు రెండు రోజుల సమయం పట్టేది. దీంతో కరోనా రోగులు పడుతు న్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్‌కు ఆర్టీపీసీ ఆర్ ల్యాబ్ మంజూరు చేసేందుకు కృషి చేశారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి జిల్లాకు ల్యాబ్ మంజూ రు చేయించారు. రూ.1.50 కోట్ల నిధులతో జిల్లా దవాఖానలో ప్రత్యేక గదిలో ల్యాబ్‌ను ఏర్పాటు చేయించారు.ఈ ల్యాబ్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల కు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభిం చనున్నారు. ఇందుకు దవా ఖాన సూపరింటెండెంట్ దేవేం దర్ రెడ్డి అన్ని ఏర్పాట్లను చేశా రు. ఇది వరకు ఈ టెస్టులు హైదరాబాద్‌లో మాత్రమే చేసే అవకాశం ఉంది. కరోనా వైరస్ నిర్ధారణకు గతంలో స్వాబ్ ద్వారా మాత్రమే పరీక్షలు నిర్వ హించేవారు. కచ్చితమైన ఫలి తాలు రావాలంటే ఈ పరీక్ష తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో రూ.1000 -1500 వరకు ఫీజును వసూలు చేసు న్నారు. ఇక నుంచి జిల్లా దవాఖానలోనే ఆర్టీపీ సీఆ ర్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించను న్నారు. రోజుకు గరిష్టంగా 200 పరీక్షలను నిర్వహించ వచ్చని వైద్యులు తెలిపారు. జిల్లా ప్రజల ఆరోగ్యం పై శ్రద్ధ వహించి జిల్లాకు ఆర్టీపీసీఆర్ ల్యాబ్ మం జూరుకు కృషి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకర ణ్‌రెడ్డికి ప్రజలు, వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలుపు తున్నారు.