
బేల జడ్పీటీసీ అక్షిత పవార్
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
బేల, జనవరి 14 : సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశారని బేల జడ్పీటీసీ అక్షిత పవార్ పేర్కొన్నారు. మండలంలోని చంద్పల్లి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ జంగ్శౌశ్, రైతులతో కలిసి సీఎం కేసీఆర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ రైతు కుటుంబానికి భరోసాగా రైతుబీమా, సాగుకు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు వాగు, జంగు, సోమ పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
ఇచ్చోడ, జనవరి 14 : వ్యవసాయాన్ని నమ్ముకొని దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉపసర్పంచ్ బల్గం రవి కుమార్ పేర్కొన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా గేర్జం గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు జుగ్నాక్ గంగారాం, మాజీ సర్పంచ్ సిడాం తులసీరాం, కనక విజయ, కనక ప్రకాశ్, మహిళా అధ్యక్షురాలు కళావతి, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.