
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్‌లో పనుల పరిశీలన
నిర్మల్ అర్బన్, జనవరి 14 : ఏప్రిల్ వరకు నిర్మల్ కలెక్టరేట్నుసిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిర్మల్ కలెక్టరేట్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆర్అండ్బీ అధికారులు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించేందుకు రూ.56 కోట్లతో నిర్మల్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, మేలో ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాలలు రాబోతున్నాయని ఈ అంశం కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైతే జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. రానున్న రోజుల్లో మెడికల్ కళాశాల తీసుకు వస్తానని చెప్పారు. మంత్రి వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, మాజీ మండల అధ్యక్షుడు ముత్యం రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు నర్సాగౌడ్, మల్లికార్జున్ రెడ్డి, కొండ శ్రీధర్ ఉన్నారు.
సంక్రాంతి సంతోషాన్ని నింపాలి
నిర్మల్ టౌన్, జనవరి 14 : సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో సిరులు కురిపించి, సంతోషాన్ని నింపాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో శనివారం సంక్రాంతి వేడుకలు నిర్వహిం చారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు సతీమణి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు గౌతంరెడ్డి, దివ్యారెడ్డి గంగిరెద్దుల కు పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులున్నారు.