
ఇంద్రవెల్లి, జనవరి 14 : మెస్రం వంశీయుల పాదయాత్ర ఉట్నూర్ మండలం సాలెవాడకు శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఉదయం వడగాం గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు గంగాజలం సేకరించే ఝరికి పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు చేశారు. మెస్రం వంశీయులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వడగాం నుంచి మెస్రం వంశీయులు పాదయాత్రగా ఉట్నూర్ మండలం సాలెవాడకు సాయంత్రం చేరుకోగా పొలిమేరలో గ్రామస్తులు స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసేందుకు అన్ని ఏర్పా ట్లు చేశారు. పాదయాత్రలో మెస్రం వంశీయులు కటోడ మెస్రం కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కటోడ మెస్రం కోశరావ్, కటోడ మెస్రం హనుమంత్రావ్, కోత్వాల్ మెస్రం తిరుపతి, గణపతి, ధర్ము, కార్తీక్, నాగు, మారుతి పాల్గొన్నారు.