
జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యులు విజయ్‌కృష్ణ, నాగేందర్
ఇంద్రవెల్లి, డిసెంబర్13 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యులు విజయ్‌కృష్ణ, నాగేందర్ అన్నారు. ఇంద్రవెల్లి దవాఖానతోపాటు హిరాపూర్ ఆరోగ్యకేంద్రాన్ని సోమవారం వారు తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని ప్రసూతి గదితోపాటు రోగుల వార్డు, మందులు స్టోర్‌రూం, రక్త పరీక్ష గది, అన్ని రికార్డులు పరిశీలించారు. గర్భిణులకు అందించే వైద్యంపై ఆరా తీశారు. కేంద్రప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం ద్వారా అందించే నిధులు, ఖర్చుల వివరాలతోపాటు రోగులకు కల్పించిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యుడు శ్రీకాంత్, హెల్త్ సూపర్ వైజర్ జాదవ్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పీహెచ్సీ పరిశీలన
భీంపూర్, డిసెంబర్ 13: భీంపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్) బృందం సోమవారం సందర్శించింది. జాతీయస్థాయి అవార్డుకు ఎంపికలో భాగంగా ఈ బృందం సభ్యులు సీమా మురళి, నాజియా షాహినా తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ డిపార్ట్మెంట్, ప్రసవాల గది, ఎన్హెచ్పీ ,ల్యాబ్ అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలు నమోదు చేసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో 108, 102 ఐటీడీఏ అంబులెన్స్‌తో గిరిజన ప్రాంతాల్లో అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. సాధారణ పరిపాలన , ఇతర సేవలను మంగళవా రం పరిశీలించనున్నారు. 2017లో ఈ పీహెచ్‌సీకి (94.5 మార్కులతో) జాతీయస్థాయి కాయకల్ప అవార్డు వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో, వైద్యాధికారి విజయసారథి, సూపర్వైజర్లు గంగాధర్, లూసి, విష్ణు, ఫార్మాసిస్ట్ రాందాస్,ఎల్టీ శ్రీదేవి, ఏఎన్ఎంలు లచ్చుబాయి, సుజాత, సిబ్బంది ఉన్నారు.