
మహిళా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
సుమోటోగా కేసు నమోదు చేయాలి
టీజేఏసీ ఆదిలాబాద్ చైర్మన్ ఎస్ అశోక్
ఎదులాపురం,డిసెంబర్13: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావుపై చర్యలు తీసుకోవాలని టీజేఏసీ(తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయీస్, టీచర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్) జిల్లా చైర్మన్ ఎస్ అశోక్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని రెవెన్యూ క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన బయోడేటా గురించి ఆరా తీశారని, ఓ జర్నలిస్ట్‌ను అడిగి తన గురించి తెలుసుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి తన పేరు గోనె ప్రకాశ్ రావే కాదంటూ సవాల్ చేశారని తెలిపారు. మహిళా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌రావుపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణ లు, విమర్శలు చేసుకోవడం సహజమని, కానీ జిల్లా ఉన్నతాధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చే యడం సీనియర్ నాయకుడు ప్రకాశ్ రావుకు తగదని హితవు పలికారు. ఆదిలాబాద్, కలెక్టర్ , ఇత ర అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ మనోధైర్యం ల్పోయే లా రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయవద్దని ఉద్యోగులు, అధికారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నవీన్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే చంద్రశేఖర్, టీజీవో అసొసియేషన్ జిల్లా కార్యదర్శి కే వనజ, ప్రభుత్వ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సర్దార్ అలీ, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రాజేశ్వర్, అసొసియేట్ ప్రెసిడెంట్ వర్ణ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
‘గోనె’ వ్యాఖ్యలు సరికాదు
నిర్మల్ టౌన్, డిసెంబర్13: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని టీఎన్జీవో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. నిర్మల్‌లోని టీఎన్జీవో భవన్లో సోమవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిబంధనలు పాటించేలా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్ని చర్యలు తీసుకున్నా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు రవీందర్, సురేందర్, ధర్మానంద్‌గౌడ్ పాల్గొన్నారు.