
జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఆయా పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
బోథ్, నవంబర్ 13: బోథ్‌లోని నాగభూషణం మెమోరియల్ పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కరస్పాండెంట్ కిశోర్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సొనాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయుడు ఆర్ మధుసూదన్, ఉపాధ్యాయులు సీహెచ్ విజయ్‌కుమార్, ఎస్ యోగానందస్వామి పాల్గొన్నారు. బోథ్‌లోని వేదం పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భీంపూర్, నవంబర్ 13: మండలంలోని కరంజి(టీ) ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంతర్గాం, పిప్పల్‌కోటి, భీంపూర్ పాఠశాలల్లో విద్యార్థులు వివిధ సాంసృతిక కార్యక్రమాలు చేపట్టారు. కరంజి(టీ)లో సర్పంచ్ జి.స్వాతిక, ఉపసర్పంచ్ ఆకటి లక్ష్మీబాయి, ఎంపీటీసీ ఆర్ దేవమ్మ, హెచ్ఎం మన్నె ఏలియా, భూమన్న, ఉపాధ్యాయులు సూర్యకళ, లత, మధుకర్‌రెడ్డి, నాయకులు నరేందర్‌యాదవ్, రెడ్డి శంకన్న, రమేశ్, నితిన్, వినోద్ పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 13 : రాజురా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు మల్లీశ్వరి, నరేశ్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. వడూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ బుక రాములు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హెచ్ఎం సుధారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బేల, నవంబర్ 13 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠాశాలలో పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్ఐ కళ్యాణ్, హెచ్ఎం కోల నర్సింహులుఉపాధ్యాయులు మనోజ్ చంద్రసేన్, రాజ్‌కుమార్, సోనేరావ్, దేవేందర్, జయకర్, వేణు పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 13: మండలంలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవానీ ఆనంద్, ప్రకాశ్, ఊశన్న, విద్యార్థులు పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 13: మండలంలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు సంజీవ్‌రెడ్డి, కృష్ణ, సదానందం, వెంకన్న, భరత్, శ్రీనివాస్, ఎంపీటీసీలు అశోక్, రేఖ, ఉప సర్పంచ్ అశోక్ , హెచ్ఎంలు వెంకటరమణ, అలేఖ్య, కిష్టయ్య, సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు