
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 13: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీల అన్నారు. శనివారం మావలలోని పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన గాలికుంటు నివారణ టీకాల ప్రారంభం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పశువైద్య శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. దీనిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి దూద్రాం రాథోడ్, పశువైద్య సిబ్బంది సాయి ప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు.
టీకాలను తప్పక వేయించాలి
బజార్హత్నూర్ నవంబర్13: పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధికి నివారణ టీకాలను తప్పక వేయించాలని జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, మండల పశువైద్యాధికారి పర్వేజ్ హైమద్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని జాతర్ల, బజార్హత్నూర్, కోల్హారి, భూర్కపల్లిలో పశువైద్య శిబిరాలు నిర్వహించి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈసందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ..రైతులు పాడిపశువుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. ఇక్కడ పశువైద్య సిబ్బంది, రైతులు ఉన్నారు.
జీవాలకు టీకాలు
ఇచ్చోడ, నవంబర్ 13 : మండలంలోని జున్నీ, గాంధీనగర్, బోరిగామ గ్రామాల్లో శనివారం మూగ జీవాలకు గాలి కుంటు నివారణ టీకాలు వేశారు. 530 పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు కుంట అరుంధతి, గుట్టే మాధవ్, స్థానిక పశువైద్యాధికారి గోవింద్ నాయక్, పశువైద్య సహాయకురాలు సంధ్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.