
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర
‘చైల్డ్ లైన్ సే దోస్తీ’ కరపత్రాలు విడుదల
ఎదులాపురం, నవంబర్ 13 : బాలల హక్కులను కాపాడే బాధ్యత అందరిదని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ‘చైల్డ్ లైన్ సే దోస్తీ’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చైల్ట్‌లైన్ సే దోస్తీ కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించి బాలల హక్కులను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, గ్రామ, మం డల, జిల్లా స్థాయిలో బాలల హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. బాలల నేస్తం, చైల్డ్‌లైన్ 24 గంటల పాటు సేవల కోసం 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. మనం నివసిస్తున్న ప్రాం తం, గ్రామ, పట్టణంలో వివక్షకు గురవుతున్న బా లలు కనిపించినా, నిరాశ్రయులైన బాలలను గు ర్తించినా వెంటనే సమాచారం అందించాలని పే ర్కొన్నారు. ముఖ్యంగా బాల్యవివాహాల సమాచా రం తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, డీసీపీవో రాజేంద్రప్రసాద్, చైల్డ్‌లైన్ కో ఆర్టినేటర్ తిరుపతి, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు దశరథ్, డేవిడ్, సమీర్ ఉల్లాఖాన్, 1098 సిబ్బంది రాకేశ్, రాజు, ప్రవీణ్, శ్రీకాంత్, నరేందర్, ప్రేమ్ కుమార్, క్యాంపు కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్, ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత పాల్గొన్నారు.