
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
టీఆర్ఎస్లో చేరిన భోరజ్ సర్పంచ్, బీజేపీ నాయకులు
ఆదిలాబాద్ రూరల్/జైనథ్, ఆగస్టు 13: మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జైనథ్ మండలం భోరజ్ గ్రామ సర్పంచ్ నిమ్మల దేవిదాస్ ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 70మంది కార్యకర్తలు శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట భారీగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రతి పల్లె అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. కొన్ని పార్టీలు తమ స్వార్థం కోసం యువతలో మతాల చిచ్చుపెట్టి అలజడి సృష్టించడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పార్టీల వైపు యువత వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకటరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్ఢి భోజారెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్ లింగా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ఎంపీటీసీ మల్లారెడ్డి, మహేందర్ ఉన్నారు.
పంటల పరిశీలన…
ఎమ్మెల్యే జోగురామన్న తన స్వగ్రామంలో పంటలను పరిశీలించారు. ప్రస్తుతం పత్తిపంటను గులాబీ రంగు పురుగు ఆశిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన లింగాకర్షక బుట్టలను పరిశీలించారు.