
ఆర్మీ, పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఉచిత నివాస, భోజన వసతి
ఇప్పటికే 772 మంది కేంద్ర బలగాలకు ఎంపిక
196 మందికి పోలీస్ శాఖలో అవకాశం
భూపాలపల్లి/ రెబ్బెన డిసెంబర్ 12: కార్మిక కుటుంబాలు, ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగ యువతీయువకులకు సింగరేణి సంస్థ అండగా నిలుస్తున్నది. సేవా సమితి ఆధ్వర్యంలో వారికి వివిధ రంగాల్లో శిక్షణనందిస్తూ మంచి భవిష్యత్‌కు పునాది వేస్తున్నది. కొన్నేండ్లుగా ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల్లో ఎంపికకు అవసరమైన శిక్షణ నందిస్తుండగా, యువత సద్వినియోగం చేసుకుంటున్నది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో యువత కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కొలువులు సాధించగా.. జీవితంలో స్థిర పడిన వారంతా సింగరేణి సహకారానికి సెల్యూట్ చేస్తున్నారు.
ఉత్పత్తి , ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమానికి సింగరేణి కృషి చేస్తున్నది. కార్మిక కుటుంబాల్లోని నిరుద్యోగులతో పాటు ప్రభావిత గ్రామాల యువతకూ అండగా నిలుస్తున్నది. ఆర్మీ, పోలీస్, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నది. అవసరమైన శిక్షణ ఇప్పిస్తూనే, వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది.
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో తమకెవరూ సాటిలేరని తన రికార్డులను తానే తిరగరా స్తూ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్లోకెల్లా అగ్రగామిగా నిలు స్తూ సింగరేణి సంస్థ సత్తా చాటుతూ వస్తున్నది. బొగ్గు ఉత్పత్తిలోనే కా కుండా విద్యుత్ ఉత్పాదకరంగంలో తనదైన శైలిలో ముం దుకు సాగుతూ విజయబావుట ఎగురవేస్తూ వస్తున్నది. సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నది. 1999లో సింగరేణి సేవా సమితిని ఇందుకోసం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఉచిత వృత్తి విద్యా కోర్సులు, పోలీస్, ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నది. పరిసర గ్రామాల యు వత, మహిళలు, సింగరేణి సంస్థ ఉద్యోగుల కుటుంబీకులకు ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన చేకూర్చుతున్న ది. ఈ ఇరవై ఏండ్లలో సింగరేణి వ్యాప్తంగా 4312 మంది ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందగా, ఇందులో 772 మంది ఎంపికయ్యారు. అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యో గ అభ్యర్థులు 1573 మంది శిక్షణ పొందగా, 196 మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇలా..
సింగరేణి సంస్థ ఆర్మీ, పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే ఉచిత శిక్షణకు యువతను ఎంపిక చేయడానికి కొన్ని ప్రమాణాలను పాటిస్తుంది. ఇందులో భాగంగా అభ్యర్థులు తగిన శా రీరక ప్రమాణాలు కలిగి ఉండాలి, ఎత్తు 170 సెంటీమీటర్లు, శ్వాస తీసుకున్న సమయంలో ఛాతి 5 సెంటీమీటర్లు పెరగాలి. 1600 మీటర్ల పరుగుపందెంలో నెగ్గాలి. పులప్స్ చేయాలి. ఇందులో నెగ్గిన యువతీయువకులనే ఎంపిక చేస్తుంది.
ఉచిత శిక్షణ ఇలా..
ప్రతీయేటా 40రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఒక్కోసారి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చిన సందర్భాలు ఉ న్నాయి. మొదట్లో రిటైర్డ్ ఆర్మీ అధికారులను నియమించి శి క్షణ ఇప్పించింది. ప్రస్తుతం సింగరేణి ఉద్యోగుల్లోనే శిక్షకులను ఎం పిక చేసి, వారి ద్వారా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు సింగరేణి సంస్థ స్వయం గా వసతి, భోజనం, పండ్లు ఉచితంగా అందిస్తున్నది. దేహదా రుఢ్య శిక్షణతోపాటు, రాత పరీక్షల్లో మెళకువలు నేర్పడానికి ప్ర త్యేక బోధకులను నియమించింది. దీంతో ఈ అవకాశాన్ని స్థాని క యువత సద్వినియోగం చేసుకుంటున్నది.