
అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించిన ముస్లింలు
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 12: మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ముస్లింలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అయ్యప్పస్వామికి పూజలు చేసి, భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్నిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్ హాజరై మాట్లాడారు. మతాల కతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడంపై ముస్లిం లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుధామల్ల హరికృష్ణ, సురేశ్ బల్దువా, మాదంశెట్టి సత్యనారాయణ, ముస్లిం యూత్ అధ్యక్షుడు ఎండీ సోహైల్‌ఖాన్, ఆథిక్, ఎస్కే తాజ్ బాబా, జుబేర్రొద్దీన్, అంజద్ ఖాన్, రహీక్, యూసుఫ్, జుబేర్‌ఖాన్, మహేశ్, కంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
నస్పూర్ పట్టణంలో..
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 12: నస్పూర్ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పడిపూజ నిర్వహించారు. అంతకుముందు శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, మాజీ ఎమ్మె ల్సీ ప్రేమ్‌సాగర్‌రావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప సేవా సమితి అధ్యక్షుడు పేరం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారిశెట్టి కుమారస్వామి, పురుషోత్తమాచారి గురుస్వామి, జీఎం సురేశ్, అయ్యప్ప సేవా సమితి సభ్యులు బీవీ రమణ, గోలి వజ్రవేలు, శ్రీనివాస్, చంద్రయ్య, చారి, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, మర్రి రాజమౌళి, నాయకులు మోతె కనుకయ్య, దగ్గుల మధుకుమార్, కందుల ప్రశాంత్, భూపతి మధు, జాడి భానుచందర్ పాల్గొన్నారు.