
ఇచ్చోడ, నవంబర్ 12 : పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలని జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి డాక్టర్ రంగారావు అన్నారు. మండలంలోని కామగిరిలో శుక్రవారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో పాల ఉత్పత్తి, జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తొడసం భీంరావ్, స్థానిక పశువైద్యాధికారి గోవింద్ నాయక్, పశువైద్య సహాయకురాలు సంధ్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 12 : నేరడిగొండలో పశువైద్య శిబిరం నిర్వహించారు. పశు వైద్యాధికారి సుశీల్‌కుమార్ పశువులకు టీకాలు వేశారు. డాక్టర్ రంగారావ్, ఎల్ఎస్ఏ అరుణ్, సిబ్బంది సురేశ్, గంగయ్య, బాదిరావ్ పాల్గొన్నారు.
నార్నూర్, నవంబర్ 12: గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని గాదిగూడ ఎంపీపీ ఆడా చంద్రకళ, రాజేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఎంపీపీ ప్రారంభించారు. సిబ్బంది పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్ప ంచ్ మెస్రం జైవంత్‌రావ్, ఉప సర్పంచ్ దిగంబర్, పశువైద్య సహాయకుడు కిశోర్,సిబ్బంది ఉన్నారు.
తాంసి, నవంబర్ 12 : మండల కేంద్రంలో శుక్రవారం పశువైద్యశిబిరాన్ని సర్పంచ్ కృష్ణ, పశువైధ్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ శిబిరాన్ని ప్రారంభించారు. రైతులు పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలన్నారు. రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి,నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, గంగారాం, మహేం దర్, విలాస్, ఆశారెడ్డి, రామన్న యాదవ్ ఉన్నారు.