ఎమ్మెల్యే దివాకర్‌రావు
టీఆర్ఎస్ కమిటీల ఎన్నిక
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 12: కార్యకర్తలు పార్టీకి కొండంత బలమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్‌కాలనీలో 23వ వార్డు కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని తెలిపారు. ఎన్నికైన కమిటీ సభ్యులందరూ, కార్యకర్తలతో కలిసి క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ,ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కమిటీ ఎన్నిక ఇన్చార్జిలు అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, బండి రమేశ్, తిప్పని రామయ్య, పానుగంటి సత్తయ్య, జక్కు ల రాజేశం, అక్కూరి సుబ్బయ్య, సయ్యద్ ఖాసీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గరిసె భీమయ్య, నాయకులు ఆకునూరి సంపత్‌కుమార్, బొడ్డు చిన్నయ్య, పెరుమాళ్ల జనార్దన్, కాటం రాజు, పండుగ శ్రీధర్, రాందేని శ్రీనివాస్, తదితరులున్నారు.
ఎన్నికైన కమిటీ సభ్యులు
నస్పూర్ 23వ వార్డు కమిటీ ఉపాధ్యక్షుడిగా సాగె శ్రీనివాస్‌రావు, కార్యదర్శిగా వీర్ల తిరుమల్‌రావు, సంయుక్త కార్యదర్శిగా రేగుంట పోశం, కోశాధికారిగా పిన్నింటి మల్లారెడ్డి, యూత్ అధ్యక్షుడిగా ఎంకేవై కృష్ణా, ఉపాధ్యక్షుడిగా బిరుదు శ్రీను, కార్యదర్శిగా తిప్పారపు విజయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా మహిపాల్‌రెడ్డి, కోశాధికారిగా బద్రి శ్రావణ్‌కుమార్ పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమించారు