e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home ఆదిలాబాద్ ‘పది’కి సన్నద్ధం

‘పది’కి సన్నద్ధం

టెన్త్‌ ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ
పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న ఉపాధ్యాయులు
100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి
ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు

వెనుకబడ్డ విద్యార్థులపై దృష్టి
పరీక్షలకు హాజరుకానున్న 12,424 మంది పిల్లలు

సిరికొండ, డిసెంబర్‌ 7 : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి రోజూ ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. అర్థమయ్యేలా పాఠాలు బోధించడమేగాకుండా పిల్లల్లో మనోబలాన్ని నింపుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో కస్తూర్బా, మోడల్‌, హైస్కూళ్లు 128 ఉండగా, పదో తరగతి విద్యార్థులు 12,424 మం ది ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించారు. వచ్చే ఏడాది నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో ముం దుకెళ్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ఫ్రీ ఫైనల్‌ పరీక్షల వరకు నిర్వహించనున్నారు. అర్థమయ్యేలా పాఠాలు బోధించడంతో పాటు సందేహాలను నివృత్తి చేస్తున్నారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్ర త్యేక దృష్టి పెడుతున్నారు. వారిలో ఆత్మస్థయిర్యం నింపుతున్నారు. సిలబస్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించి.. రివిజన్‌ చేసేందుకు యత్నిస్తున్నారు. గతంలో హిందీ తప్ప అన్ని సబ్జెక్టులకు సంబంధిం చి రెండు పేపర్లు ఉండేవి. ఈ విద్యా సంవత్సరం పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒకే పేపర్‌ ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ఈ అంశాల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో గతేడాది విద్యార్థులకు సరిగా క్లాసులు జరగలేదు. కేవలం డిజిటల్‌ తరగతులు మాత్రమే నిర్వహించారు. దీంతో ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా అందరినీ పాస్‌ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు కొనసాగుతున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

- Advertisement -

ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు
మా టీచర్లు సబ్జెక్టుల వారీగా పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తు న్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తున్నారు. మాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. బాగా చదివి పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటా.

  • జీ. శ్లేష, 10 వతరగతి, జడ్పీ హెచ్‌ఎస్‌, సిరికొండ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
    కరోనా కాలంలో విద్యార్థులు చదు వుకు దూరమయ్యారు. ఈ సారి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
    -ప్రణీత డీఈవో,ఆదిలాబాద్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement