
భైంసా టౌన్, అక్టోబర్, 11 : ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ నేషనల్ కమిటీ, డ్రీమ్స్ స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో సోమవారం దేగాంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులను వాడి అధిక లాభాలు గడించాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు స్వచ్ఛంద సంస్థ వారు అందజేసిన పాల క్యాన్లు, సేంద్రియ ఎరువుల బస్తాలు, గోమూత్రంతో తయారు చేసిన మందులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్, డ్రీమ్స్ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
కుంటాల, అక్టోబర్, 11 : మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన ఎం అనిల్‌కు రూ. 46 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైంది. సోమవారం ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి తన నివాసంలో బాధిత కుటుంబానికి ఆ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెంట రవి, ఉప సర్పంచ్ రజినీకాంత్, ఆత్మ, ఏఎంసీ డైరెక్టర్లు డాక్టర్ భోజన్న, ముత్యం, నాయకులు బండి రమణాగౌడ్, టీ రజినీకాంత్, రాజేందర్‌రెడ్డి, నవీన్, వెంకట్ పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎం ఆర్ఎఫ్
భైంసా, అక్టోబర్, 11 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరమని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. సోమవారం దేగాంలోని తన నివాసంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారి ఆరోగ్య రక్షణకు సీఎంఆర్ఎఫ్ ఎంతో సహాయపడుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులు దేవన్నకు రూ. 56 వేలు, సాయన్నకు రూ. 25 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆనంద్, భోజన్న, గంగాధర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.