
బోథ్, అక్టోబర్ 11: పేద ప్రజల ఆరోగ్యానికి సర్కారు భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు రూ. 6,67,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బోథ్ మండలానికి చెందిన ఐదుగురు, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు మండలాలకు చెందిన ముగ్గురు చొప్పున, గుడిహత్నూర్, తాంసి మండలాలకు చెందిన ఒక్కొక్కరికి సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న పేదలను సీఎంఆర్ఎఫ్తో ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
తాంసి, అక్టోబర్11: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయయని బోథ్ ఎమ్మెల్యే బాపురావ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో 20 సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉండబోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో రవీందర్, రైతుబంధు సమతి మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సామ నాగారెడ్డి, సర్పంచులు కృష్ణ, వెంకన్న, కేశవ్‌రెడ్డి, సదానందం, శ్రీనివాస్, భరత్, గజానన్, శంకర్, ఎంపీటీసీలు నరేశ్, అశోక్, రఘు, నాయకులు ధనుంజయ్, కాంత్‌రెడ్డి, గంగారాం పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మితో లక్షల కుటుంబాల్లో కాంతులు
భీంపూర్, అక్టోబర్11: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో లక్షల కుటుంబాల్లో సంతోషం నిండిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. సోమవారం భీంపూర్‌లో 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. వడూర్, వడ్గాం, గోనా గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మండలం ఏర్పాటై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, సర్పంచులు లింబాజీ, కృష్ణ యాదవ్, భూమన్న, అజయ్, హనుమద్దాసు, నాయకులు ఉత్తంరాథోడ్, సంతోష్, కపిల్, నరేందర్ యాదవ్, కల్చాప్ యాదవ్, ఏనుగు అశోక్‌రెడ్డి, రెడ్డి రమేశ్, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.