
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించడంపై టీఆర్ఎస్వీ హర్షం
సీఎంకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 11: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించడంపై టీఆర్ఎస్వీ నాయకులు సంబురాలు జరిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో అమరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణతల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివ కుమార్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడూస్తూ విద్యార్థి లోకాన్ని ఏకం చేసిన గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిచడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీలు వాగ్మారే ప్రశాంత్, గొర్ల శంకర్, నాయకులు సాయి, రఘు, మనోజ్, సూరజ్, సాయికిరణ్, ప్రఫుల్, కిరణ్ కుమార్, వేణుగోపాల్, వెంకన్న పాల్గొన్నారు.
కార్యకర్తలకు గుర్తింపు
నిర్మల్ టౌన్, ఆగస్టు 11: రాష్ట్రం కోసం కేసీఆర్‌తో కలిసి కోట్లాడిన టీఆర్ఎస్ నాయకులకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మహేశ్ అన్నారు. శ్రీనివాస్‌యాదవ్ సేవలను గుర్తించి పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసి టీఆర్ఎస్వీని మరింత పటిష్టం చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్, సాయేందర్, సతీశ్ పాల్గొన్నారు.