
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
తాంసి, ఆగస్టు 11: ఆపత్కాలంలో పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని గిరిగాంకు చెందిన పలువురికి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరోగ్య శ్రీ పథకం వర్తించని చికిత్సలకు ఈ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్త్తుందన్నారు. పెద్దమొత్తంలో చికిత్సకు డబ్బులు అవసరం ఉంటే అన్ని రకాల టెస్టులకు సంబంధించిన రిపోర్టులు జతచేసి దరఖాస్తు చేసుకుంటే ముందుగానే ఎల్వోసీని అందజేస్తున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలను ఆదుకుందన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
మండలంలోని గిరిగాంలోని దత్తాత్రేయ మందిరం వద్ద కాలక్షేప మండపం నిర్మాణం కోసం దేవాదాయశాఖ తరఫున రూ.12లక్షలు మంజూరు చేసినందుకు స్థానికులు ఎమ్మెల్యేను సన్మానించారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, తాంసి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ రఘు, నాయకులు గంగారాం, ఉత్తం తదితరులున్నారు.
పట్నాపూర్ అభివృద్ధికి సహకారం
బోథ్, ఆగస్టు 11: పట్నాపూర్ గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ హామీ ఇచ్చారు. పట్నాపూర్ గ్రామస్తులు బుధవారం ఆదిలాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేయగా కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆప్క కిషన్, తొడసం గోపాల్, కైలాస్, పంద్రం శంకర్, ఆత్రం గోవిందు, గొడం యాదవ్‌రావు, ఆప్క వెంకటేశ్, నీలకాంత్ పాల్గొన్నారు.