
నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే
దిలావర్పూర్, జనవరి 11 : జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కల రక్షణపై దృష్టిపెట్టాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ఆదేశించారు. దిలావర్పూర్, న్యూ లోలం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కలను మంగళవారం మండలాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు గ్రామ పంచాయతీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పల్లెప్రగతి పనులు నిరంతరం కొనసాగాలన్నారు. ఆయన వెంట డ్వామా పీడీ విజయలక్ష్మి, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఈజీఎస్ ఏపీవో జగన్నాథం, సర్పంచ్‌లు వీరేశ్‌కుమార్, ఈవో చంద్రశేఖర్, పంచాయతీ సిబ్బంది రాజు, సంతోష్ తదితరులు ఉన్నారు.
బృహత్ ప్రకృతి వనం పరిశీలన..
భైంసాటౌన్, జనవరి 11 : మండలంలోని వా టోలి బృహత్ ప్రకృతి వనాన్ని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ సమయంలో భూమి చదును చేసి, కంచె ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటినందుకు సిబ్బందిని అభినందించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో గంగాధర్, ఏపీవో శివలింగం, ఎంపీవో మోజామ్ హుస్సేన్, టీఆర్ఎస్ నాయకుడు సచిన్ తదితరులు ఉన్నారు.