
కేంద్రం తీరుతో వ్యవసాయంపై భారం
10 నెలల్లో రూ.22 పెరుగుదల.. ప్రస్తుతం రూ.102.40
ఉమ్మడి జిల్లాలో సగటున 6 లక్షల లీటర్ల విక్రయం
70 శాతం సాగు రంగానికే వినియోగం
యంత్రాల రేట్లు పెంచిన యజమానులు
బీజేపీ ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం
నిర్మల్ టౌన్, అక్టోబర్ 10;ఇక్కడ ట్రాక్టర్లో డీజిల్ పోస్తున్న ఇతని పేరు నాలం రవి. కుంటాల మండలం ఓల గ్రామం. ఉపాధి కోసం కొన్నాళ్లు గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కరోనా నేపథ్యంలో ఇంటికొచ్చాడు. ఉపాధి కోసం అప్పు చేసి ఈ యేడాది జనవరిలో ట్రాక్టర్ కొన్నాడు. అప్పుడు డీజిల్ లీటర్ ధర రూ.81.60 ఉండే. ఈ పది నెలల్లో రూ.20.80 పెరిగి ప్రస్తుతం రూ.102.40 చేరింది. దీంతో డీజిల్ భారం మోయలేక ఇబ్బంది పడుతున్నాడు. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో వ్యవసాయం చేద్దామని వస్తే కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న చమురు ధరలు ఆశనిపాతంలా మారాయి. దీనికితోడు ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులూ పెరిగిపోవడంతో వాటిని రైతులపై వేయాల్సి వస్తున్నందుకు బాధగా ఉందని రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. …ఈ పరిస్థితి ఒక్క రవిదే కాదు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితర వాటిపై జీవనోపాధి పొందుతున్న ప్రతి ఒక్క యజమానిది. ప్రస్తుతం డీజిల్ ధర సెంచరీ దాటడంతో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలపై యజమానులు ధరలు పెంచగా, దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాకా ఎకరానికి ఒక్కో రైతుపై రూ.1500 భారం పడుతున్నది.
ఈయన పేరు సాయన్న, హార్వెస్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఇదే సీజనల్లో డీజి ల్ ధర రూ. 78 ఉంటే ఇప్పుడు రూ. 102 చేరుకోవడంతో హా ర్వెస్టర్ నిర్వహణ రోజురోజుకూ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను త గ్గిస్తే గానీ గిట్టుబా టు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .. ఈ పరిస్థితి ఒక్క సాయన్నకు మాత్రమే ఎదురవ డం లేదు..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రై తులు, వాహనదారుల అవస్థలు. రెండేళ్ల నుం చి పెట్రోల్, డిజీల్‌తో పాటు అన్ని రకాల వస్తువుల ధరలను పెంచడంతో సామాన్యులపై భా రం పడుతున్నది. వ్యవసాయానికి యంత్రీకరణను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడం రైతుల నడ్డి విరుస్తున్నది.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 10 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 220 పెట్రోల్ బంక్ లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో రోజుకు సగటున ఒక్కో బంక్‌లో 2500-3000 లీటర్ల చొప్పున 5-6 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో 70 శాతం వ్యవసాయ యంత్రీకరణ కోసమే వినియోగిస్తుండడంతో పెరిగిన ధరల భారం రైతులపై పడుతోంది. ఈ యేడాది జనవరిలో జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 81 ఉండగా.. రూ. 21 పెరిగి ప్రస్తు తం రూ. 102 కు చేరుకున్నది.
పెరిగిన ధరలతో రైతుల ఇబ్బందులు..
రబీ సీజన్‌కు రైతులు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ భుములు దున్నేందుకు ట్రాక్టర్లు వినియోగిస్తుంటారు. బావులు, బోర్ల సౌకర్యం లేనివారు వాగుల్లో డీజిల్‌తో మోటర్లను నడిపిస్తుంటారు. సోయా, మక్కజొన్న, మినుము, జొన్న, తదితర పంటల నూర్పిడికి యంత్రాల వాడకం పెరుగుతున్నది. గతేడాది ఇదే సీజనల్లో ట్రాక్టర్లతో దుక్కులు దున్నేందుకు గంట కు రూ. 700 చార్జి ఉండగా.. ఈ ఏడాది రూ. 850కి పెంచారు. హార్వెస్టర్‌కు ఎకరానికి రూ. 1400 ఉండగా.. ప్రస్తుతం రూ. 1700 చేరుకున్నది. చైన్మిషన్కు రూ. 2400-2800 వరకు ధర పెరిగింది. సగటున రూ. 300-400 అదనపు చార్జిలు మోపడంతో రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. ట్రాక్టర్ ట్రి ప్పునకు రూ. 350 ధర ఉండగా.. ఇప్పుడు రూ. 400 పెంచారు. డీజిల్ రేట్లు తగ్గించాలని ఉమ్మడి జిల్లా రైతులు కోరుతున్నారు.
రైతులు ఇబ్బందులు పడుతున్నారు..
ప్రస్తు తం సోయా కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది ఎకరానికి రూ.1400 తీసుకు న్నాం. డీజిల్ ధర లు పెరగడంతో ఇప్పు డు రూ. 1700 తీసుకుంటు న్నాం. పెరిగిన డీజి ల్ ధరలతో ఆ భారం రైతులపై తప్పనిసరిగా వేయాల్సి వస్తోంది.
-మహేందర్, హార్వెస్టర్ యజమాని
పంట ధరలను కూడా పెంచాలి..
డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్న కేంద్రం పంటలకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. సో యా దిగుబడులు రా కముందు క్వింటాలు ధర రూ. 8500 ఉండేది. ఈ 15 రోజుల్లోనే రూ.2 వేలు తగ్గిం చి రూ. 6500 కొనుగో లు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే ఖర్చులకే పోతే మేముఎట్లా బతికేది.
ముత్తన్న, రైతు, కుంటాల