
జనసంద్రమైన గంగనీళ్లజాతర
అట్టహాసంగా ముగింపు
అమ్మవారికి మొక్కలు తీర్చుకున్న భక్తులు
ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించిన మహిళలు
భారీగా పోలీస్ బందోబస్తు
సారంగాపూర్/దిలావర్పూర్, అక్టోబర్ 10 : సారంగాపూర్ మండలం అడెల్లి పుణ్యక్షేత్రం వద్ద శనివారం ప్రారంభమైన గంగనీళ్ల జాతర ఆదివా రం అట్టహాసంగా ముగిసింది. అయితే ఆదివారం వేకువజాము నుంచే సుదూర ప్రాంతాలకు చెంది న భక్తులు ఆలయానికి చేరుకుకున్నారు. ఉదయం నుంచే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిం చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చె ల్లించుకున్నారు. మహిళలు నైవేద్యాలు వండి బోనాలు సమర్పించుకున్నారు. కొందరు ఒడిబి య్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. అల్లుబం డ వద్ద భక్తులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కుశీపండుగలు, పుట్టవెంట్రుకలు, తులా భారం తదితర మొక్కులు కూడా చెల్లించుకున్నారు. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచియే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబా ద్, జగిత్యాల జిల్లాల నుంచి భక్తజనం తరలి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, శివిని, హిమాయత్‌నగర్, కిన్వట్, యావత్మాల్, చంద్రాపూర్ ప్రాంతాల నుంచి ఛత్తీస్‌గఢ్, ఒరి స్సా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు వచ్చా రు. వేలాది మంది తరలిరావడంతో ఆలయం కిక్కిరిసి పోయింది. దేవస్థాన చైర్మన్ అయిటి చందు, ఈవో మహేశ్, ధర్మకర్తలు, వలంటీర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ జాతరలో మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మ న్ వంగ రవీంద ర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పతాని భూమేశ్ పాల్గొన్నారు.
అడుగడుగునా అమ్మవారికి పూజలు..
గంగనీళ్ల జాతర ఆదివారం జనసంద్రమైంది. దిలావర్పూర్ మండలం సాంగ్వీ, కంజర్, బన్సప ల్లి, మాడెగాం గ్రామాల మీదుగా ఆశేష భక్త జనం తో అమ్మ వారి అభరణ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ఉదయం అమ్మ వారి అభర ణాలకు సాంగ్వీలోని పోచమ్మ ఆలయం నుంచి గోదావరికి తీసుకెళ్లి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుం చి భక్తజనంతో కలిసి ప్రారంభమైన శోభాయాత్ర ఆయా గ్రామాల మీదుగా సాగింది. దిలావర్పూ ర్లో గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పరిసర ప్రాంతంలో అమ్మ వారికి డప్పువా యిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మ వారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. శోభాయాత్ర గ్రామంలో దారి పొడవున సాగింది. అమ్మవారికి భక్తులు కానుకలు అందిం చి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరిలో అమ్మ వారి అభరణాలకు స్నానం చేయించుకొని మధ్యాహ్నం సారంగాపూర్ మండలం ప్యారమూ ర్ నుంచి వంజర్, యాకర్‌పల్లి, సారంగాపూర్, అడెల్లి గ్రామాలకు సాయంత్రం చేరుకున్నారు. మహిళలు అమ్మ వారి నగలను తీసుకొచ్చిన పూజారుల పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నా రు. అమ్మ వారికి ఎంపీపీ ఏలాల అమృత, స్థానిక సర్పంచ్ వీరేశ్ కుమార్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కోడే రాజేశ్వర్, ఎంపీటీసీలు పాల్దె అక్షర, అనిల్, గంగవ్వ, ముత్యంరెడ్డి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు, సర్పంచ్ అచ్యుత్‌రావు, ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ రూరల్ సీఐలు వెంకటేశ్, రాం నర్సింహరెడ్డి, అమ్మ వారికి పూజలు చేశారు. హిందూవాహిని ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం, పులిహోర అందించారు.
భారీ పోలీస్ బందో బస్తు…
జాతరకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, రూరల్ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు, ఐదుగురు ఏఎస్ఐలు, 40 మందిని పోలీసులను నియమించారు. సారంగాపూర్ ఎస్ఐ రమణా రెడ్డి, సోన్ ఎస్ఐ ఆసీఫ్, నిర్మల్ ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, మామడ ఎస్ఐ వినయ్, సీఎస్ఐ కృష్ణ సాగర్‌రెడ్డి బందోబస్తు చేపట్టారు.
జాతరకు పార్డీ (కే) పోచమ్మ
బోథ్, అక్టోబర్ 10 : మండలంలోని పార్డీ (కే) గ్రామంలో కొలువైన పోచమ్మ విగ్రహాలను ఆది వారం గంగనీళ్ల జాతరకు తీసుకెళ్లారు. డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించారు. మహిళలు నెత్తిమీద బిందెలతో ఉత్సవ మూర్తుల విగ్రహాల ను తీసుకొని అడెల్లికి బయలు దేరారు.
కడ్తాల్‌లో..
సోన్, అక్టోబర్ 10 : సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గంగనీళ్ల జాతరను అంగరంగ వైభ వంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన మహాపోచమ్మ తల్లి ఆభరణాలకు గ్రామస్తులు స్వాగతం పలికారు. ఆదివారం తెల్లవారుజామున సోన్ గోదావరి నది తీరంలో ఆభరణాలను శుద్ధ్ది చేశారు. పాదయాత్రగా గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేశారు.