
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10: దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సంతోషం గా ఉండాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆల యం నుంచి దుర్గానగర్‌లోని ఆలయం వరకు చేపట్టిన పాదయాత్రను ఎమ్మెల్యే రామన్న ఆది వారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో ప్రసిద్ధి చెందిన దుర్గానగర్‌లోని ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సుమారు 5కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగుతుందన్నా రు. పాదయాత్ర దుర్గానగర్ ఆలయానికి చేరుకోగా పూజారి కిషన్ మహరాజ్ వారిని ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
పరామర్శ
జైనథ్, అక్టోబర్ 10 : మండలంలోని జామిని గ్రామానికి చెందిన పెందూర్ శారద పెదనాన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జోగురామన్న పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ పెందూర్ దేవన్న, నాయకులు తానాజీ, భరత్, సురేశ్, జగన్నాథ్ తదితరులున్నారు.