
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10 : ఉపాధ్యా యుల సంక్షేమానికి పాటుపడుతామని ఎమ్మెల్యే లు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ పేర్కొ న్నారు. ఆదిలాబాద్‌లోని ఆదివారం ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సి ల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఈసంద ర్భంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యావలంటీ ర్లను నియమించాలని, స్కావెంజర్లను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరి ష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. విద్యావలంటీర్లు , స్కావెంజర్ల సమస్యలను సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామ న్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, తదితర సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ పే స్కేల్ 2020 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సుధాకర్, పర్వతిరెడ్డి, భుజంగర్రావ్ , సాతూరి ముకుంద్‌రావ్, జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు అశోక్, మూగ శ్రీనివాస్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.