
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
50మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నార్నూర్,ఆగస్టు10: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో మంగళవారం 50మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
అన్నాబావుసాటే స్ఫూర్తితో ముందుకెళ్లాలి
అన్నాబావుసాటే స్ఫూర్తితో నేటితరం ముందుకెళ్లాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ఖంపూర్లో మతంగ్ సమాజ్ ఆధ్వర్యంలో అన్నాబావు సాటే జయంతి నిర్వహించారు. మహనీయుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అన్నాబావుసాటే సేవలను కొనియాడారు. పలు సమస్యల ను స్థానికులు జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, ఎంపీపీ కనక మోతుబాయి, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, సర్పంచ్ సలాం ఆనంద్రావ్, ఎంపీటీసీ పరమేశ్వర్, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, తెలంగాణ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాథోడ్ సుభాష్, టీఆర్ఎస్ నాయకులు కనక ప్రభాకర్, ఉదయ్, దస్తగిరి, ఆడే తుకారాం మహరాజ్, నర్సింగ్మోరే, రమేశ్, పండరి, కమిటీ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.