ఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పలు సమస్యలపై కలెక్టర్‌కు వినతులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా పరిష్కారానికి వివిధ శాఖల అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు.
కొందరు అధికారులకు ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. మండుటెండలో జనం ప్రజావాణికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు దరఖాస్తులు అందజేశారు. రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు పాల్గొన్నారు.