నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురకులాలు, కేజీబీవీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరైన 133 మంది విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు దేశ్ముఖ్ సచిన్ తెలిపారు. సిరికొండ మండలంలోని రిమ్మ ఆశ్రమ పాఠశాల, నేరడిగొండ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కుమారి, తేజాపూర్, వడూర్, వాంకితో పాటు టీడబ్ల్యూఆర్ఈఐఎస్ నేరడిగొండ, ఆశ్రమ ఉన్నత పాఠశాల కుంటాల(కే), లఖంపూర్, కొర్టికల్ పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంద్రవెల్లి మండలంలో ఆశ్రమపాఠశాలలు అద్భుత ఫలితాలు నమోదు చేశాయి. ఇంద్రవెల్లి, పిట్టబొంగురం, వడగాం, కేస్లాపూర్, హీరాపూర్ కేజీబీవీ, ముత్నూర్లోని గురుకులం పాఠశాలల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు.
తలమడుగు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 37 మంది విద్యార్థులు పరీక్ష రాసి శతశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్వో అర్చన తెలిపారు. తాంసి మండలంలోని బండల్ నాగాపూర్ ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రిన్సిపాల్ అసుమతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్లోని శాంతినగర్ కాలనీ గురుకుల పాఠశాల, నర్సాపూర్(జీ)లోని కేజీబీవీ, భైంసా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కేజీబీవీలో, ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జడ్పీఎస్ఎస్, కడెం మండలంలోని పాత మద్దిపడగ, కస్తూర్బా, నచ్చన్ఎల్లాపూర్ లోని సోషల్ వెల్పేర్, జీయర్ గురుకులం పాఠశాల, దస్తూరాబాద్ మండలంలోని మున్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో, నార్నూర్లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తెలిపారు.