
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 9: పట్టణంలోని ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని కైలాస్‌నగర్‌లో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, ఓపెన్ జిమ్ పనులను, కోలిపురలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెలే జోగు రామన్న సహాయంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీలతో సంబంధంలేకుండా అన్ని కాలనీలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పట్టణంలో సుమారు 15 చోట్ల ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, ఫ్లోర్‌లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్లు అర్చన, శ్రీనివాస్, పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు సన్మానం
ఉపాధ్యాయవృత్తి ఎంతో పవిత్రమైనదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులను కైలాస్‌నగర్‌లో ఘనంగా సన్మానించారు. భావిభారత పౌరులను క్రమశిక్షణతో తయారు చేసే అవకాశం ఉపాధ్యాయులకు మాత్రమే కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణ్, కిరణ్‌కుమార్, నవీన్‌యాదవ్, కౌన్సిలర్ అర్చన, రామ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి, గంగారెడ్డి, అశోక్ పాల్గొన్నారు.