
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 9 : బతుకమ్మ పండుగను పేద మహిళలు ఆనందంగా జరుపుకో వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొ న్నారు. శ్యాంపూర్ గ్రామంలో శనివారం మహిళ లకు బతుకమ్మ చీరెలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న దని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అనంతరం దుర్గామాతను దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు ఎమ్మె ల్యేను సన్మానించారు. సర్పంచ్ మల్లిక, ఎంపీపీ పంద్రజైవంత్రావు, వైస్ ఎంపీపీ దావులే బాలా జీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీ మొద్దీన్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజే శ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, నాయకు లు రవీందర్, బాజీరావు, విష్ణు పాల్గొన్నారు.
మహిళ సంక్షేమానికి ప్రభుత్వం కృషి
సిరికొండ, అక్టోబర్ 9 : మహిళా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్కొన్నారు. రాంపూర్ గ్రామంలో బతుకమ్మ చీరెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాంపూర్, సిరికొండ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సర్పం చ్ రేణుక బాయి, ఉప సర్పంచ్ ప్రహ్లాద్, నాయ కులు బాలాజీ, సునీల్ కుమార్, చేండె బాలాజీ, రాజ్ కుమార్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.