శ్రీరాంపూర్, సెప్టెంబర్ 9 : శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్‌లో సిబ్బందికి, కార్మిక కుటుంబాలకు జీఎం ఎం సురేశ్ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, మంచినీరు కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కే హరినారాయణగుప్తా, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, ఈఈ కుమార్, డీవైజీఎం గోవిందరాజు, అరవిందరావు, చిరంజీవులు, రాఘవేంద్రరావు, ఎన్ రమేశ్, పీఎం సుదర్శన్, పిట్ కార్యదర్శి పీవీ వారు పాల్గొన్నారు.
మందమర్రి సీఈఆర్ క్లబ్లో..
మందమర్రి రూరల్, సెప్టెంబర్ 9 : మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో కార్మిక కుటుంబాలకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించడం ఎంతో శ్రేష్ఠమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం గోపాల్‌సింగ్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, పీఎం వర ప్రసాద్, పర్యావరణ అధికారి ప్రభాకర్, సీనియర్ పీవో సత్యబోసు, నర్సింహయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్జీ-3 ఏరియాలో..
రామగిరి, సెప్టెంబర్ 9 : ఆర్జీ-3 ఏరియాలోని జీఎం కార్యాలయంలో జీఎం మనోహర్, ఏఈఏ ఇన్చార్జి జీఎం బైద్య కార్మిక కుటుంబాలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి కార్మికుడూ తమ ఇంట్లో మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు రఘుపతి, విలాస్ శ్రీనివాస్, నాగేశ్వరరావు, చంద్రశేఖర్, షఫీ తదితరులు పాలొన్నారు.
గోలేటి డిస్పెన్సరీ వద్ద..
రెబ్బెన, సెప్టెంబర్ 9 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి డిస్పెన్సరీ వద్ద జీఎం సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి కార్మిక కుటుంబాలకు మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, పీఎం లక్ష్మణ్‌రావు, డీవైపీఎం తిరుపతి, సుజాత రాజేంద్రప్రసాద్, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.