
నిర్మల్ టౌన్, ఆగస్టు 9 : క్విట్ ఇండియా పేరుతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడు దామని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు ట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని వామపక్షాల నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎన్ రెడ్డి, రాజ న్న, నూతన్ కుమార్, సురేశ్, రాంలక్ష్మణ్, గం గన్న, సత్యనారాయణ, గఫూర్, శంకర్, తదిత రులు పాల్గొన్నారు.
చట్టాలను రద్దు చేయాలి
కడెం, ఆగస్టు 9 : కేంద్రం రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తణక్షమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ యూ సంఘాల ఆధ్వర్యంలో కడెం తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనం తరం తహసీల్దార్ ఖలీంకు వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరి తిరుపతి, సునీల్, నల్లాల భూమన్న, విజయ్, శ్రీనివాస్, చంద్రమౌళి, గోపాల్, నాగరాజు, రమేశ్, రాజేందర్, రాజేశ్, ఫిరోజ్, పార్వతి, భాగ్య, గంగారాజం, నర్సయ్య, తదితరులున్నారు.
మోదీ విధానాలను వ్యతిరేకించాలి
దస్తురాబాద్, ఆగస్టు 9 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు అనసూర్య కోరారు. దస్తురాబాద్‌లో తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ గజానాన్కి సీఐటీయూ ఆధ్వర్యం లో వినతి పత్రం అందజేశారు. ఆశ కార్యకర్తల మండల యూనియన్ అధ్యక్షురాలు సుజాత, వీఆర్ఏల మండల సంఘం అధ్యక్షుడు విజ య్, వీఆర్ఏలు శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.