
ఎదులాపురం,డిసెంబర్8: కొవిడ్ నియంత్రణకు టీకా ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పట్టణంలోని రవీంద్రనగర్‌లో ఇప్పటి వరకు మొదటి డోస్ తీసుకోని వారికి కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. రవీంద్రనగర్‌లో మొదటి డోస్ వేసుకోని 19 మందికి టీకాలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, శాంతినగర్ యూపీహెచ్సీ సీవో కేమ రాజారెడ్డి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
టీకాతోనే కరోనా నియంత్రణ
బోథ్, డిసెంబర్ 8: కొవిడ్ టీకాతోనే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కౌఠ (బీ)లో బుధవారం ఇంటింటికీ వెళ్లి టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచితంగా టీకా ఇస్తున్నదని చెప్పారు. మొదటి డోస్ టీకా వేసుకొని గడువు పూర్తయిన వారు త్వరగా రెండో డోస్ తీసుకోవాలని సూచించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. ఆయన వెంట సొనాల పీహెచ్సీ డాక్టర్ కే నవీన్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి, సర్పంచ్ కే రాధిక, ఉప సర్పంచ్ రవీందర్, కార్యదర్శి సంజీవ్‌రావు, జాహెద, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
నార్నూర్, డిసెంబర్ 8 : గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని గాదిగూడ ఎంపీవో సాయిప్రసాద్ అన్నారు. గాదిగూడ మండలంలోని మారెగావ్వో నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని తెలిపారు. వైద్య సిబ్బంది ఉన్నారు.
భీంపూర్, డిసెంబర్8: మండలంలోని కరంజి(టీ), అర్లి(టీ), ధనోరా ఉపకేంద్రాల పరిధిలో వైద్య సిబ్బంది బుధవారం కొవిడ్ టీకాలు వేశారు. ఇప్పటికే 90 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని సూపర్వైజర్ గంగాధర్ తెలిపారు. కార్యక్రమలో సిబ్బంది పాల్గొన్నారు.
బేల, డిసెంబర్ 8 : మండల కేంద్రంతో పాటు పోహర్, డోప్టాల తదితర గ్రామాల్లో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు టీకాలు తీసుకోని వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. మొదటి డోస్ తీసుకోని వారికి ఈ నెల నుంచి రేషన్ సరుకులు ఇవ్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లలిత , పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.