
బెల్లంపల్లిరూరల్, నవంబర్ 8: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అసత్య ఆరోపణలు చేయడం తగవని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ మాట్లాడుతూ నెన్నెల మండలంలోని జెండావెంకటాపూర్‌లో దళితులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చిన్నయ్య వారి అభివృద్ధిని కాంక్షించి ఉద్వేగంతో అన్న మాటలను ఉద్దేశపూర్వకంగా అన్నట్లు వైఎస్ఆర్ సీపీ నాయకులు చిత్రీకరిస్తున్నారు తప్పా ఎక్కడా వారిని కించపర్చేలా ఎమ్మెల్యే మాట్లాడలేదన్నారు. కౌన్సిలర్లు దామెర శ్రీనివాస్, రాములు నాయక్ మాట్లాడుతూ కొంతమంది నాయకులు ఎమ్మెల్యే పై లేనిపోని ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం మానుకొని ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు గోసిక రమేశ్, కొమ్ము సురేశ్, టీఆర్ఎస్ నాయకుడు జక్కుల శ్రీధర్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దామెర కిరణ్, ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ బైరం రాజేందర్ నాయకులు పాల్గొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు
బెల్లంపల్లి రూరల్, నవంబర్ 8 : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసి సామాజిక మాద్యమాల్లో అసత్యప్రచారం చేసిన వైఎస్ఆర్ సీపీ పెద్దపల్లి కన్వీనర్ కాశీ సతీశ్, ఎల్తూ రి శంకర్, తోడె కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక టీఆర్ఎస్ నాయకులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ రాములకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దామెర శ్రీనివాస్, టీఆర్ఎస్ 20 వ వార్డు అధ్యక్షుడు సత్యం పాల్గొన్నారు.