
ఆసిఫాబాద్,అక్టోబర్8 : తెలంగాణకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో తయారుచేసిన బతుకమ్మల వద్ద కలెక్టర్ సతీమణి, మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ రాజేశం, డీడబ్ల్యూవో సావిత్రి, తదితరులున్నారు.
కౌటాల, అక్టోబర్ 8 : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలో ప్రిన్సిపాల్ స్వరూప ఆధ్వర్యంలో విద్యార్థులు పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటిచు ట్టూ తిరగుతూ ఆడిపాడారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో..
బెజ్జూర్, అక్టోబర్ 8 : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు బతుకమ్మలను పేర్చి ఆడి పాడా రు. తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంబురాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజయ్య తెలిపారు. అధ్యాపకులు శారద, భూలక్ష్మి, ప్రశాంత్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, సపన్ కుమార్ మండల్, విద్యార్థులు పాల్గొన్నారు.
జైనూర్, అక్టోబర్ 8: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, సిబ్బంది, విద్యార్థులు బతు కమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళా శాలకు ఎన్ఎస్ఎస్ యూనిట్ మంజూరు కాగా, వారి ఆధ్వ ర్యంలోనే వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేణు, అధ్యాపకులు ప్రభాకర్, సునీల్, శివ య్య, సంతోష్, ప్రకాశ్, సురేశ్, ప్రమోద్‌కుమార్, అనంతలక్ష్మి, సరస్వతి, లింగామూర్తి, రాంబాబు, విద్యార్థులు ఉన్నారు.