
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
అదనపు గదులకు భూమి పూజ
ఇంద్రవెల్లి, అక్టోబర్ 8 : నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తు న్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ధనోరా(బీ)గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో జడ్పీ నిధులు రూ. 5 లక్షలతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మ న్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొ రేట్ తరహాలో సర్కారు విద్యాను అందిస్తుందన్నారు. నాణ్యతతో గదులు నిర్మించి విద్యాభివృద్ధికి అంద రూ కృషి చేయాలని సూచించారు.
టీఆర్ఎస్తోనే పండుగలకు గుర్తింపు
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ధనోరా(బీ)లో జడ్పీటీసీ ఆర్కా పుష్పల త, ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్తో కలిసి మహి ళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్ జనార్ధన్, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ కోఆప్ష న్ సభ్యుడిని గ్రామస్తులు సన్మానించారు. ఆయా చోట్ల మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్ ఏర్మ జాకేశ్వర్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్య క్షుడు షేక్ సుఫియాన్, ఎంపీటీసీలు మంజూశా, కోవ రాజేశ్వర్, ఐకేపీ ఏపీఎం రాథోడ్ రామారా వ్, లక్కారాం మాజీ సర్పంచ్ మర్సుకోలా తిరు పతి, షెడ్యుల్ క్యాస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ దుర్గే, నాయకులు ఆర్కా ఖమ్ము, శ్రీహరి, సంతోష్ మహరాజ్, సతీశ్, సునిల్, ఉత్తమ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.