
రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు
నూతన అతిథి గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
బాసర, అక్టోబరు 8 : బాసర సరస్వతీ ఆల యంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొన సాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం సరస్వతీ అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆలయంలో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించారు. అర్చకులు పుణ్యహ వచనం, అంకురార్పన, తదితర పూజలు నిర్వ హించారు. సరస్వతీ అమ్మ వారిని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం రూ. 7కోట్ల 50లక్షలతో నూత నంగా నిర్మించిన అతిథి గృహాలను ఆయన ప్రా రంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, లోలం శ్యాంసుందర్, తదితరులున్నారు.
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 8 : నవరాత్రో త్సవాల్లో రెండోరోజు దుర్గామాత బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కేం ద్రంలోని దుర్గానగర్ దుర్గామాత ఆలయంలో పూజారి కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు.