
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు అన్నారు. మండలంలోని చాందూరిలో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. దంతన్పెల్లిలో సర్పంచ్ భూమన్న, టీఆర్ఎస్ నాయకులు చీరెలు పంపిణీ చేశారు.మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, నాయ కులు మునీర్, సులేమాన్ యాఫై, అరవింద్, విజయ్, సందీప్,సంతోష్‌రెడ్డి,సలీం,మొయినొద్దీన్,శంకర్, వహీద్, శ్రీను,మోకిద్, హనీఫ్, ప్రకాశ్, నాను తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 8: మండలంలోని కామట్‌వాడలో జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, సర్పంచ్ తాటిపెల్లి లావణ్య మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కరంజి(టీ)లో 300 మంది మహిళలకు ఎంపీపీ రత్నప్రభ , జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ జీ స్వాతిక , ఉపసర్పంచ్ ఆకటి లక్ష్మీబాయి, నాయకులు జీ నరేందర్ యాదవ్, నరేందర్‌రెడ్డి ,కార్యదర్శి నితిన్ చీరెలు పంపిణీ చేశారు.
బోథ్, అక్టోబర్ 8: అందూర్, మందబొగుడ, కరత్వాడలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు ఆడె అంగూరిబాయి, ఆడె చాంగుబాయి, దుర్వ సింధు, ఎంపీటీసీలు మడావి అమరావతి, గొడం జగాదిరావు, గులాబ్‌సింగ్, రమేశ్, దేవిదాస్, రామారావు, సోనేరావు, అభిమాన్, సీసీ గంగాధర్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్,అక్టోబర్ 8: డోంగర్‌గామ్, గుడిహత్నూర్, మన్నూర్ గ్రామాల్లో ఐకేపీ సిబ్బంది, స్థానిక సర్పంచ్ల సమక్షంలో చీరెలు అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ ఓర్సు లక్ష్మీబాయి, ఐకేపీ సీసీ నాగమణి పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 8 : మండలోని కంఠ, మండగాడ, మేడిగూడ, మాకోడ గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు వైద్యబాలాజీ, ఎం సురేఖ, ఇందుబాయి, శ్యాం పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 8: మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు ప్రజాప్రతినిధులు, అధికారులు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. మండలంలోని చాంద (టీ)లో సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుదర్శన్ పాల్గొన్నారు.