e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home ఆదిలాబాద్ దేశానికి సైనికులే రక్షణ కవచం

దేశానికి సైనికులే రక్షణ కవచం

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం

ఎదులాపురం, డిసెంబర్‌ 7 : భారత దేశానికి సైనికులే రక్షణ కవచం లాంటివారని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నా రు. సాయుధ దళాల పతాక దినోత్సవం-2021 వేడుకలను కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్‌సీసీ కెడెట్లతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. సాయుధ దళాల పతాక దినోత్స వం సందర్భంగా ఎన్‌సీసీ కెడెట్ల ద్వారా విరాళాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విరివిగా విరాళాలు సేకరించి దేశ రక్షణ కోసం అంకితమైన సైనికుల కుటుంబాల సహాయానికి అం దించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన నిధిని డైరెక్టర్‌ సైనిక వెల్ఫే ర్‌ హైదరాబాద్‌-82 పేరి ట డీడీ (డిమాండ్‌ డ్రాఫ్ట్‌) లేదా చెక్కు రూపంలో పంపిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ తనవంతుగా డబ్బాలో విరాళం వేశారు. ఇన్‌చార్జి ప్రాం తీయ సైనిక సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్‌ అసిస్టెంట్‌ కే కిశోర్‌, 32 ఆంధ్రా బెటాలియన్‌ ఎన్‌సీసీ అధికారి గడ్డం అశోక్‌, వినోద్‌ కుమార్‌, వామన్‌రెడ్డి, అనిల్‌, మనోహర్‌, వెంకట్రావు, శ్రీ హరి, మాజీ సైనికులు పాల్గొన్నారు.

నిర్భయంగా టీకా తీసుకోండి..
గుడిహత్నూర్‌, డిసెంబర్‌ 7 : అర్హులంతా నిర్భయంగా కొవిడ్‌ టీకా తీసుకోవాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పేర్కొన్నారు. మండలకేంద్రం లోని జైభీంనగర్‌లో మంగళవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఒమిక్రాన్‌ వైరస్‌ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. సర్పంచ్‌ జాదవ్‌ సునీత శ్రద్ధ, సహకారం బాగుందంటూ అభినందించారు. డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథో డ్‌, డీపీవో శ్రీనివాస్‌, మండల వైద్యాధికారులు శ్రీనివాస్‌, నీలోఫర్‌, తహసీల్దార్‌ పవన్‌చంద్ర, ఎంపీడీవో సునీత, ఈవోపీఆర్డీ లింగయ్య, ఐకేపీ ఏపీఎం భగవాండ్లు, డీఈ శివరాం పాల్గొన్నారు.

- Advertisement -

వ్యాక్సిన్‌ వేసుకున్న శతాధిక వృద్ధురాలు
ఇచ్చోడ, డిసెంబర్‌ 7 : మండలంలోని జామి డి గ్రామానికి చెందిన సూర్యవంశీ గవుబా యి(102) కొవిడ్‌ టీకా వేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇచ్చోడ ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి ఆకుదారి సాగర్‌ ఆధ్వర్యంలో మంగళవారం మండల అధికారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ అర్హులకు కొవిడ్‌ టీకాలు వేశారు. ఇం దులో భాగంగా సూర్యవంశీ గవుబాయి ఇంటికి వెళ్లిన అధికారులు కొవిడ్‌ గురించి అవగాహన కల్పించి టీకా వేశారు. సర్పంచ్‌ హరన్‌ సుభాష్‌, ఎంపీడీవో రాంప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆడ, మగ సమానమే
ఎదులాపురం,డిసెంబర్‌ 7: దేశంలో ఆడ, మగ ఇద్దరూ సమానమేనని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పేర్కొన్నారు. సఖీ ఆదిలాబాద్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రచారోద్యమంలో భాగంగా స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జడ్పీ సమావేశ మందిరంలో సభ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌ సఖీ సెంటర్‌ ఉన్నతంగా పనిచేస్తున్నదని అభినందించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ ఝాన్సీ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణారెడ్డి మా ట్లాడారు. అనంతరం ప్రచారోద్యమం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సఖీ సెంటర్‌ నిర్వాహకురాలు యశోద, ప్యానల్‌ లాయర్‌ వెండి భద్రేశ్వర్‌, ఎంసీహెచ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ నవ్యసువిధ, సీడబ్ల్యూసీ చైర్మన్‌ వెంకటస్వామి, డీసీపీవో రాజేంద్రప్రసాద్‌, కళాశాలల విద్యార్థులు, అంగన్‌ వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement