
మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో గ్రామంలో అభివృద్ధి
టీఆర్ఎస్ మల్లాపూర్ నాయకులు
ధర్మారం, డిసెంబర్7: సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు వివరిస్తామని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మల్లాపూర్ సర్పంచ్ గంధం వరలక్ష్మీ నారాయణ, ఉప సర్పంచ్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మంద శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గుమ్మడి అశోక్, అనుబంధ యూత్, బీసీ, ఎస్సీ, మహిళా విభాగం గ్రామ శాఖ అధ్యక్షులు కుమ్మరి రాము, పులి శ్రీనివాస్ గౌడ్, నిమ్మ మధు, నిమ్మ రాజేశ్వరి, నాయకులు ఆశోద లక్ష్మీరాజం, మిల్కూరి నారాయణ, కొడిపెల్లి నర్సయ్య, గంధం రాజయ్య వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. పల్లెల అభివృద్ధికి పల్లె ప్రగతి ద్వారా నిధు లు మంజూరు చేస్తుండడంతో గ్రామాలు కొత్తశోభను సంతరించుకుంటున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధికి ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ సహకరిస్తున్నారని వివరించారు. మండలంలోనే తొలి నమూనా పల్లె ప్రకృతి వనం గ్రామం లో ఏర్పడిందని, పీఎంఏజీవై ద్వారా రూ. 30 లక్షల నిధులు మంజూరు చేయడంతో 2 సీసీ రోడ్లు, 2 కల్వర్టులు, అంగన్వాడీ పాఠశాలకు ఆట వస్తువులు కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రూ. 10 లక్షలతో సోలార్ వీధిలైట్లు త్వరలో ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఎస్డీఎఫ్ ద్వారా రూ. 10 లక్షల నిధులతో 2 సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. ఎల్ఎం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎక్స్‌రోడ్‌లో అంబేద్కర్ విగ్ర హం ఏర్పాటు చేయగా, త్వరలో ప్రారంభించ నున్నామని చెప్పారు. తమకు పార్టీ పదవులు అప్పగించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.