రెబ్బెన, అక్టోబర్ 7: బెల్లంపల్లి ఏరియా నూతన గనులతో కళకళలాడుతూ పూర్వ వైభవం రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి-1 ఇైంక్లెన్ భూగర్భగనిలోని దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ గురువారం ప్రారంభమయ్యాయి. ఏరి యా జీఎం సంజీవరెడ్డి-రాధాకుమారి దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ..గోలేటి ఓసీపీ, ఎంవీకే ఓపీపీ తొందరలో ప్రారంభమై ఏరియాకు పూర్వ వైభవం రావాలని అందుకు శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి మంగీలాల్, కార్యదర్శి సంపత్‌రావు, బీపీఏవోసీపీటూ పీవో చంద్రశేఖర్, పిట్ ఇంజినీర్ నరేశ్, వెల్ఫేర్ అఫీసర్ ప్రశాంత్, మేనేజర్ సౌరభ్సుమన్, వెల్ఫేర్ ఆఫీసర్ ప్రశాంత్, పిట్ కార్యదర్శి అన్నం లస్మయ్య, యూనియన్ ప్రనినిధులు పేరం శ్రీను, శేషు, కృష్ణమోహన్, సూపర్వైజర్లు రాఘవరెడ్డి, కృష్ణ పలువురు పాల్గొన్నారు.
రామగిరి, అక్టోబర్ 7 : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 ఫేస్-2 ఆవరణలోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు సముద్రాల విజయసారథి ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రారంభించారు. ప్రాజెక్టు అధికారులు పలు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ అధికారులు రాధాకృష్ణ, శ్రీనివాస్, కోటయ్య, సునీల్ ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, జైపాల్ రెడ్డి తదితరులున్నారు.
యైటింక్లయిన్ కాలనీ, అక్టోబర్ 7 : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3, వకీలుపల్లి, జీడీకే 7 ఎల్ఈపీ గని, ఓసీపీ-1 ప్రాజెక్టుల్లో గురువారం దుర్గాదేవి నవరాత్రోత్సవ పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆయా గనుల వద్ద దుర్గాదేవి ఆలయాల్లో అధికారులు, కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు గనులపై ప్రతిరోజూ పూజలు నిర్వహించి అన్నదానం చేయనున్నారు. ఓసీసీ-3 ప్రాజెక్టు అధికారి మోహన్‌రెడ్డి, వీకేపీ గని ఏజెంట్ కాంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ రవికిరణ్, 7ఎల్ఈపీ గని మేనేజర్ తిరుపతి, ఓసీపీ-1 ఏజెంట్ రాధాకృష్ణ, మేనేజర్ ఉదయ్ హరిజన్, తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, అక్టోబర్ 7 : ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 ఫేస్-2 ఆవరణలోని శ్రీ భద్రకాళీ ఆలయంలో గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ అధికారులు రాధాకృష్ణ, శ్రీనివాస్, కోటయ్య, సునీల్ ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, జైపాల్ రెడ్డి ఉన్నారు.
బతుకమ్మ పాట సీడీ ఆవిష్కరణ
భూపాలపల్లి, అక్టోబర్ 7 : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుక మ్మ వేడుకలను పురస్కరించుకొని ఓ సింగరేణి కార్మికుడు రచించిన బతుకమ్మ పాట సీడీని గురువారం జీఎం టీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న రాపెల్లి విజయ్‌కుమార్ బతుకమ్మ పాటను రచించారు. ఈ పాట సీడీని జీఎం ఆవిష్కరించారు. విజయ్‌కుమార్ పాటను రాయడంతో పాటు పాడారు. పాట రాయడంతో పాటు పాడడం గొప్ప విషయమని, మున్ముందు మంచి పాటలు రచించి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విజయ్‌కుమార్‌కు జీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, డీజీఎం (సివిల్) సత్యనారాయణ, అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, సీనియర్ పీవో రాజేశం, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ మల్లిక్ ఉత్తమ్ కుమార్, కౌన్సిలర్ మురళి, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ బేతోజు వజ్రమణి, టీఆర్ఎస్ నాయకులు బీబీ చారి, జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.