
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజన్
కరంజి(టి)లో పచ్చదనం బాగున్నది : అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
బోథ్, అక్టోబర్ 7 : మొక్కల పెంపకంలో బోథ్ మండల పరిషత్ కార్యాలయం ఆదర్శంగా నిలు స్తున్నదని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నటరాజన్ పేర్కొన్నారు. గురువారం బోథ్ ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఆవరణలో ఏర్పాటు చేసిన గార్డెన్, పల్లె ప్రకృతి వనం, నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధు లు, అధికారులు సమన్వయంతో ప్రతీ కార్యాల యంలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వా లన్నారు. పచ్చదనం తీరుపై ఎంపీపీ తుల శ్రీని వాస్, ఎంపీడీవో సీహెచ్ రాధను అభినందిం చారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను ఎంపీపీ సత్కరించి మొక్కను అందించారు. తహసీల్దార్ ఎం శివరాజ్, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, ఎం రాజేశ్వర్, చట్ల ఉమేశ్, మహిపాల్, షేక్, రోహి దాస్, సర్పంచ్‌లు శ్రీధర్‌రెడ్డి, విజయ్ ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
బజార్హత్నూర్, అక్టోబర్ 7 : ప్రజలకు అం దుబాటులో సేవలందించాలని అదనపు కలెక్టర్ నటరాజన్ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. తహసీల్‌లో ధరణి వెబ్‌సైట్‌ను పరిశీలించి రోజువారీ రిజిస్ట్రేషన్ల వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం పీహెచ్సీలో కొవిడ్ వాక్సినేషన్ వివరాలపై ఆరా తీశారు. గ్రామ గ్రామాన వెళ్లి ప్రతి ఒక్కరికీ టీకా వేసి 100 శాతం పూర్తి చేయా లని సూచించారు. తహసీల్దార్ గంగాధర్, వైద్యా ధికారి సురేశ్, ఆర్ఐ మురళీధర్ పాల్గొన్నారు.
కరంజి(టి)లో పచ్చదనం బాగున్నది
భీంపూర్, అక్టోబర్ 7 : కరంజి(టీ) పంచాయ తీలో పల్లె ప్రకృతివనం బాగున్నదని, జీపీ, గ్రామస్తులు కలిసి సొంతంగా నిధులు సమీకరిం చుకుని అదనంగా హరితహారం చేపట్టడం ఆదర్శ మని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కితాబునిచ్చారు. అదనపు కలెక్టర్ భీంపూర్ మండల సరిహద్దు గ్రామం కరంజి(టీ)ని సంద ర్శించారు. ఇక్కడ 10 ఎకరాల్లో 30 వేల మొక్కల పెంపకం లక్ష్యంతో రూ.43 లక్షల అంచనా వ్య యంతో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనంలో పనులు పరిశీలించారు. ఒక దుకాణం బయట చెత్తాచెదారం ఉండడంతో ఆగ్రహం వ్యక్తం జేశారు. అర్లి(టీ)లో వ్యాక్సినేషన్ పరిశీలిం చారు. సర్పంచ్‌లు గుర్ల స్వాతిక, గొల్లి రమాబా యి, ఉపసర్పంచ్ ఆకటి లక్ష్మీబాయి, కార్యద ర్శు లు నితిన్, సందీప్, ఈజీఎస్ ఈసీ నరేందర్, నాయకులు జీ నరేందర్‌యాదవ్, ఆకటి నరేంద ర్‌రెడ్డి, వైభవ్, కపిల్ తదితరులున్నారు. అర్లి(టీ) లో వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఆఅదనపు కలెక్టర్ కస్మికంగా తనిఖీ చేశారు. సర్పంచ్, ఏఎన్ఎంలను వివరాలు అడిడి తెలుసుకున్నారు. ప్రస్తుతం మరో 20 మంది టీకాలు తీసు కుంటే 100 శా తం అయినట్లేనని సిబ్బంది, సర్పంచ్ గొల్లి రమా బాయి అదనపు కలెక్టర్‌కు వివరించారు. జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఏఎన్ఎంలు నఫీజా, సుజాత, జనాబాయి, ఆశ కార్యకర్త అనసూయ, వైభవ్ తదితరులున్నారు.