
బోథ్, అక్టోబర్ 7: టీఆర్ఎస్తోనే బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. బోథ్‌లోని రైతు వేదిక భవనంలో గురువారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ జీ సురేందర్ యాదవ్, ఎంపీడీవో సీహెచ్ రాధ, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్‌బిన్ సలాం, ఎంపీటీసీలు మహేందర్, రజియా బేగం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, ఎలుక రాజు, ప్రవీణ్, ఏపీఎం మాధవ్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 7: మండలంలోని మత్తడిగూడ పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఎంపీడీవో తిరుమల మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. సర్పంచ్ మడావి యశోదబాయి, ఈవో సత్యనారాయణ, గ్రామస్తులు మోతీరాం, కొద్దు, లచ్చు, టీఏ భాస్కర్ పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 7 : మండలంలోని గూడలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షడు తుమ్మల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, సర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ తోట రమేశ్ పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 7: మండలంలోని వడ్డాడిలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురుకుంటి మంజుల, శ్రీధర్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు అశోక్, రఘు, నవీన్, గణపతి, జ్ఞానేశ్వర్, నవీన్, భూమన్న, రామయ్య, దాసు పాల్గొన్నారు. తమకు దళిత బస్తీ కింద మూడెకరాల చొప్పున భూమి కేటాయించాలని 10 మంది మహిళలు ఎంపీపీ, జడ్పీటీసీలకు విన్నవించారు. జడ్పీటీసీ తాటిపెల్లి రాజు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఆయనతో కేక్‌కట్ చేయించారు. మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.